ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది.ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
అయితే రాష్ట్రంలోని పలు పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎం( EVMs )లు మొరాయించాయి.దీంతో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైందని తెలుస్తోంది.
మంగళగిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించాయి.ఈ క్రమంలోనే సీకే హైస్కూల్, కొప్పురావుకాలనీ, మోరంపూడి వంటి ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
అయితే పోలింగ్ లో ఈసారి యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలుస్తోంది.