ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి..!!

ఏపీలో ఈసారి ఎన్నికలను చంద్రబాబు( Chandrababu ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.2019లో అధికారం కోల్పోవడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్త పడటం జరిగింది.ఇందుకోసం బీజేపీ, జనసేన( BJP , Jana Sena ) పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం జరిగింది.2014లో మాదిరిగా విజయం సాధించాలని చంద్రబాబు వ్యవహాత్మకంగా అడుగులు వేయడం జరిగింది.అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యటనలు చేశారు.

 Chandrababu Appeals To Everyone To Exercise Their Right To Vote , Chandrababu, A-TeluguStop.com

ఎన్నికల ప్రచారం చివరికి వచ్చేసరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో ఉభయ గోదావరి జిల్లాలలో అనేక వేదికలను పంచుకున్నారు.ఎట్టి పరిస్థితులలో రెండోసారి వైసీపీ గెలవకూడదని సంచలన స్పీచ్ లు ఇచ్చారు.

చివరిలో బీజేపీ అగ్రనేతులతో కలిసి బహిరంగ సభలలో పర్యటించడం జరిగింది.ఇదిలా ఉంటే సోమవారం పోలింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో చంద్రబాబు సంచలన పోస్ట్ పెట్టారు.“ప్రజా చైతన్యం వెల్లివిరియాలి… రాష్ట్ర భవిష్యత్ ను మార్చేందుకు మీ ఓటే కీలకం.మీతో పాటు మరో నలుగురు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించండి.

మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది మీరు వేసే ఓటే.నిర్భయంగా, నిజాయతీగా, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube