ఏపీలో మొదలైన పోలింగ్ .. మొత్తం ఎంతమంది ఓటర్లంటే ?

ఏపీలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది.ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు.

 Polling Started In Ap.. How Many Voters, Ap Election, Voters, Vote, Election Com-TeluguStop.com

ఇక ప్రధాన పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఉదయం ఐదు గంటలకే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు.ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడంతో , గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం రాష్ట్ర వ్యాప్తంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులు ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేశారు.  సమశ్యాత్మక,  అత్యంత సమశ్యాత్మక  పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు .పోలింగ్ స్టేషన్ దగ్గర ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Telugu Ap, Congress, Commison India, Janasena, Vote, Ysrcp-Politics

ఇక అరకు పార్లమెంట్ ( Araku )నియోజకవర్గంలోని అరకు, రంపచోడవరం, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పోలింగ్ జరగనుంది.  పాలకొండ,  కురుపాం సాలూరు లో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.  ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు.  సమశ్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు.

ఓటర్ల వివరాలు 

Telugu Ap, Congress, Commison India, Janasena, Vote, Ysrcp-Politics

ఏపీ వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు.వారిలో 2,10,68,615 మంది మహిళలు ఉండగా, 2,03,39,851 మంది పురుషులు ఉన్నారు.అలాగే 3,421 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు.175 స్థానాలకు గాను 156 అసెంబ్లీ స్థానాల పరిధిలో పురుషుల కంటే మహిళ ఓటర్ల ఎక్కువ మంది ఉన్నారు.ప్రజలు ఓట్లు వేసేందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఏపీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) వెల్లడించారు.

పోలింగ్ కోసం లక్ష 60 వేల ఈవీఎంలను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు .పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,20,566 మంది సిబ్బందిని నియమించినట్లు, అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube