డబ్బు చుట్టూనే లోకం తిరుగుతుందనే సామెత ఊరికే అనలేదు.డబ్బుకు అందరూ దాసోహమే.
ఇక ఓట్ల పండగ వచ్చిందంటే జనాలు చూపు ఆయా పార్టీల అభ్యర్థులు పంచబోయే నోట్ల మీదే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.పోలింగ్ ప్రక్రియకు ముందు రోజున వివిధ పార్టీలు పంచే నోట్ల కోసం జనాలు ఎదురుచూపులు చూడడం, డబ్బు పంచే వారి కోసం అర్ధరాత్రి వరకు జాగారాలు చేస్తున్న పరిస్థితి ఏపీ( AP ) లో స్పష్టంగా కనిపించింది.
అభ్యర్థి, పార్టీ ఏదైనా మాకు అనవసరం, మాకు ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారికే ఓటు అన్నట్లుగా జనాల అభిప్రాయాలు ఉండడం సమాజానికి ప్రమాదకరమే.ఓటుకు నోటు తీసుకోవడం, పంచడం చట్టరీత్య నేరమైనా, జనాలు మాత్రం అవేవీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరనే విషయం మరోసారి అర్థమయింది.
ఓటుకు నోట్లు ఇస్తేనే ఓటు వేస్తామని, లేకపోతే బహిష్కరిస్తామన్నట్లుగా చాలాచోట్ల పరిస్థితి కనిపించింది.
కొన్నిచోట్ల ఓట్లకు సొమ్ములు పంచకపోవడంతో, ఆయా పార్టీల నాయకులను నిలదీస్తూ వివాదాలకు దిగిన సంఘటనలు అనేకం గత రెండు రోజులుగా అనేక చోట్ల చోటుచేసుకున్నాయి.జనాల అభిప్రాయాలు ఇలా ఉంటే.ఆయా పార్టీల అభ్యర్థుల సైతం నోట్లు పంచి ఓట్లు సంపాదించాలనే విధంగా ఓట్ల కొనుగోలుకు తెర తీశారు.
మేనిఫెస్టోలో హామీలు, అభివృద్ధి ,ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపన, సంక్షేమ పథకాలు ఇవన్నీ పోలింగ్ ప్రక్రియ ముందు రోజు, పోలింగ్ రోజున ప్రజలు ఎవరు పట్టించుకోవడం లేదు.ఎవరు డబ్బులు ఇస్తే వారికే .ఎవరు ఎక్కువ ఇస్తే వారికే తమ ఓటు అన్నట్లుగా జనాల మైండ్ సెట్ మారిపోయింది.నోటుకు ఓటును అమ్ముకుని నాయకులను నిలదీసే అవకాశాన్ని జనాలు కోల్పోతున్నారు.
ఇప్పుడు జనాలకు పంచిన నోట్లను అంతకంటే రెట్టింపు స్థాయిలో సంపాదించుకోవడానికి నాయకులు ముందుగా ప్రాధాన్యం ఇస్తారు తప్ప ప్రజల భాగోగులను ఎందుకు పట్టించుకుంటారు ?.గతంలో ఎవరు ఎక్కువగా ప్రచారం చేసి, మౌలిక సదుపాయాలు, ప్రజల సంక్షేమం కల్పిస్తామని చెబుతారో వారికే ఓట్లు వేసేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.తమకు ఎంత వచ్చినా ఈరోజు మాత్రమే కదా అన్న ధోరణితో ప్రజలు ఉన్నారు.ఎక్కువ సొమ్ములు ఇచ్చిన వారికే ఓటు అన్న అభిప్రాయానికి వచ్చేసారు.కొన్నిచోట్ల ఓటుకు నోటు ఇవ్వకపోవడం తో వివాదాలకు దిగడం, పోలింగ్ బహిష్కరిస్తామని బెదిరించడం, కొన్నిచోట్ల ఆయా పార్టీల నాయకులు పై భౌతిక దాడులకు పాల్పడడం వంటివి చూస్తే జనాలు ఓట్ల సొమ్ము కోసం ఎంత వైలెంట్ గా మారిపోయారా అనే ఆశ్చర్యం కలుగుతోంది.