ఏపీ విద్యావిధానంపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.ఢిల్లీని తలదన్నే విధంగా ఏపీలోని విద్యా విధానం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో అధిక ప్రాధాన్యత విద్యకే ఇస్తున్నామని వెల్లడించారు.ఈ క్రమంలోనే విద్యాసంస్థలలో ర్యాగింగ్ నిషేధమని చెప్పారు.
దాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఏ ఇబ్బంది ఉన్నా అధ్యాపకులకు తెలపాలని మంత్రి బొత్స స్పష్టం చేశారు.