తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఫాక్సీలింగ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది.దీంతో కార్మికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
కాగా ప్రమాదం జరిగిన కంపెనీ రేణిగుంట ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.