ఈ కరోనా సమయంలో ప్రపంచం రుణపడి ఉందంటే అది ఒక డాక్టర్లకు, నర్సింగ్ స్టాఫ్‌కు మాత్రమే.అలాగని పారిశుద్ద్య కార్మికులు, పోలీసులు లేరని కాదు కానీ కోవిడ్ పేషంట్లకు దగ్గరా వెళ్లి చికిత్స అందిస్తూ వారిని కాపాడటానికి అహార్నిశలు పీపీ కిట్లు వేసుకుని శ్రమిస్తున్నారు వీరు.
ఇందులో కూడా కొందరు దొంగ వేషాలు వేసే వారు ఉన్నారు అది వేరే విషయం.
ఇకపోతే ఒకప్పుడు నర్స్ అంటే చులకనగా చూసే వారు.
కానీ కరోనా వల్ల నర్స్ అంటే అమ్మకంటే ఎక్కువే అయ్యారు.ఇలాంటి వృత్తిని చేబట్టిన వారిని పొగడకున్న ఫర్వాలేదు.
కానీ అవమానించ కూడదు.కానీ బెంగళూరులో మాత్రం ఒక నర్స్ పట్ల కృరంగా ప్రవర్తించారు ఒక కుటుంబం వారు.
ఆ వివరాలు చూస్తే.
ఇందిరానగర్ లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన నర్స్ ట్రైనింగ్ తీసుకుంటున్న ప్రియదర్శి(20) తల్లి గత ఏడాది కరోనాతో మరణించిందట.
ఆ తర్వాత వారి ఇంటి పక్కన నివాసం ఉండే ప్రభుకి గత నెలలో కోవిడ్ సోకిందట.అయితే తనకు ఇలా కావడానికి ప్రియదర్శి కారణం అని కక్ష పెంచుకున్న ప్రభు తన ఇద్దరు సోదరులతో కలిసి ప్రియదర్శి పై కత్తితో దాడి చేసి గాయపరిచారట.
ప్రస్తుతం ఈ కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిందట.