అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రంలో క్రిస్మస్ పరేడ్‌పైకి కారు దూసుకొచ్చిన ఘటనలో మరొకరు మరణించారు.నాటి ఘటనలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎనిమిదేళ్ల బాలుడు మరణించాడు.
దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరుకుంది.మరోవైపు అనుమానితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలియజేశారు.
నిందితుడు డారెల్ బ్రూక్స్ (39) ఉద్దేశపూర్వకంగా నరహత్యలకు దిగాడని అభియోగాలు నమోదు చేశారు.తాజాగా చిన్నారి మరణంతో ఆరవ హత్యా నేరాన్ని ఎదుర్కొంటున్నారని ప్రాసిక్యూటర్ సుసాన్ ఒప్పర్ తెలిపారు.
మరణాలకు పాల్పడినట్లు రుజువైతే నిందితుడు పలు అభియోగాలపై జైలు శిక్షను ఎదుర్కొంటాడని న్యాయమూర్తి చెప్పాడు.కోర్ట్ కమీషనర్ కెవిన్ కాస్టెల్లో బ్రూక్స్ బెయిల్‌ను 5 మిలియన్ డాలర్లుగా నిర్ణయించారు.
ఇద్దరు డిటెక్టివ్‌లు బ్రూక్స్‌ను ఆపడానికి ప్రయత్నించారని, కానీ నిందితుడు ఏమాత్రం ఆగలేదని కెవిన్ అన్నారు.తన కెరీర్‌లో ఇలాంటి కేసును చూడలేదని.
రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇది బలమైన కేసుగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక చనిపోయిన పిల్లాడిని జాక్సన్ స్పార్క్స్‌గా గుర్తించారు.
ఈ పరేడ్‌లో తమ 12 ఏళ్ల మరో కుమారుడు టక్కర్ కూడా గాయపడ్డాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోన్, షేరి స్పార్క్స్ చెప్పారు.కాగా.
నిందితుడు బ్రూక్స్ కొన్ని వారాల క్రితం మిల్వాకీలో ఒక తల్లిబిడ్డను కొట్టిన కేసులో అరెస్ట్ అయ్యాడు.అనంతరం 1000 డాలర్ల పూచీకత్తుపై విడుదలయ్యాడు.
ఈ నేపథ్యంలో 2000 సంవత్సరానికి ముందు ఏమైనా అరెస్ట్ అయ్యాడా అన్న రికార్డులను పరిశీలిస్తున్నట్లు ప్రాసిక్యూటర్ కోర్టుకు వివరించారు.విస్కాన్సిన్‌లో మాదకద్రవ్యాల నేరాలు, అక్రమంగా ఆయుధాలను కలిగి వున్నందుకు గాను పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు.
కాగా.విస్కాన్సిన్‌లోని వౌకేశా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం క్రిస్మస్ పరేడ్ జరిగింది.వందలాది మంది ఉల్లాసంగా పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ ర్యాలీగా వెళ్లారు.ఆ సమయంలో ఓ ఎస్‌యూవీ బారికేడ్లను ఢీకొట్టి మనుషుల మీదుగా దూసుకెళ్లింది.ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.దాదాపు 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు.అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారి.
కారుపై కాల్పులు జరిపి అడ్డుకునేందుకు యత్నించినప్పటికీ డ్రైవర్ వేగంగా జనాల మీదకు వెళ్లాడు.ఈ ఊహించని పరిణామంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురై ప్రాణ భయంతో పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.గాయపడ్డ వారిని ఆసుపత్రులకు తరలించారు.
ఈ ఘటనకు కారణమైన ఎస్‌యూవీని సీజ్ చేసి.ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.