కరోనా మహమ్మారి కారణంగా భారత్ నుంచీ అలాగే ప్రపంచ దేశాల నుంచీ రాకపోకలు ఏడాదిగా స్తంభించిన విషయం విధితమే.అయితే గడిచిన కొన్ని రోజులుగా పలు దేశాలు భారత్ పై ఆంక్షలు ఎత్తేస్తూ తమ దేశంలోకి వచ్చేయచ్చంటూ ఆహ్వానం పలుకుతున్నాయి.
కానీ కొన్ని నిభంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని ప్రకటించాయి.ఈ క్రమంలోనే బ్రిటన్ భారత్ నుంచీ వచ్చే వారిపై పలు రకాల ఆంక్షలు విధించింది.
భారత్ లో కరోనా కారణంగా నెలకొన్న పరిస్థితులకు తగ్గట్టుగా కెనడా తాజా నిభందనలు రూపొందించింది.
తమ దేశం విధించిన నిభందనలకు అనుగుణంగా నడుచుకోక పొతే ఇక్కడ ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది కూడా.
ఇంతకీ కెనడా విధించిన సరికొత్త నిభందనలు ఏంటంటే.భారత్ నుంచీ వచ్చే ప్రయాణీకులు తప్పకుండా ప్రయాణానికి 18 గంటల ముందుగానే RTPCR టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది.
ఒక వేళ RTPCR చేయించుకొని పక్షంలో ర్యాపిడ్ టెస్ట్ అయిన తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపింది.ఈ టెస్ట్ రిజల్ట్ లో నెగిటివ్ వస్తే సదరు సర్టిఫికెట్ తో పాటు వ్యాక్సిన్ సర్టిఫికెట్ కు జతచేసి ArriveCAN app లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఒక వేళ తాము చేయించుకున్న టెస్ట్ లలో పాజిటివ్ వస్తే ప్రయాణానికి ఎలాంటి అనుమతులు ఉండవని తేల్చి చెప్పింది.కేవలం నెగిటివ్ సర్టిఫికెట్ ఉన్న వారు మాత్రమే కెనడా రావడానికి అర్హులుగా ప్రకటించింది.ఇదిలాఉంటే కెనడా విధించిన నిభందనలపై ఏజెంట్లు సైతం ఇవి తప్పనిసరిగా పాటించేలా ఉంటేనే ప్రయాణానికి సిద్దమవ్వాలని సూచిస్తున్నారు.ఒక వేళ రూల్స్ పాటించక పొతే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా కెనడా వెళ్ళిన తరువాత అక్కడి కరోనా పరీక్షల విషయంలో తప్పకుండా సహకరించాలని సూచిస్తున్నారు.