ఆస్ట్రోనామికల్ క్లాక్ గురించి వినే వుంటారు.ప్రపంచంలోని పురాతన క్రియాత్మక ఖగోళ గడియారంగా ఈ క్లాక్‌ను 1490లో ప్రాగ్‌లోని ఓల్డ్ టౌన్ స్కేర్‌లో స్థాపించారు.
ఇప్పటికీ పనిచేస్తున్న ఈ గడియారాన్ని ‘ఓర్లోజ్‘ అని కూడా అంటారు.దీని ప్రత్యేకత ఏమిటంటే.
ఇది సూర్యుడు, చంద్రుడు, భూమితో పాటు రాశిచక్ర నక్షత్రరాశుల సాపేక్ష స్థానాలను మెరుగ్గా చూపుతుంది.వీటితోపాటు తేదీ, సమయాన్ని తెలియజేయడం దీని ప్రత్యేకత అని చెప్పుకోవాలి.
ఆస్ట్రోనామికల్ డయల్ అనేది మెకానికల్ ఆస్ట్రోలాబ్‌కు ఒక రూపం.ఇది సాధారణంగా మధ్యయుగ సమయపాలన, ఖగోళ అధ్యయనాలలో ఉపయోగించబడింది.
ఈ క్లాక్ కేంద్రానికి దగ్గరగా వెళ్తున్నప్పుడు రోమన్ సంఖ్యల సమితిని స్పష్టంగా చూడవచ్చు.అయితే నీలి, గోధుమ రంగుల్లో ఉండే భాగాలు సూర్యోదయం, పగటి సమయం, రాత్రివేళలతో పాటు ఉష్ణమండల ప్రదేశం, భూమధ్యరేఖ వంటి భౌగోళిక సమాచారాన్ని సూచిస్తాయి.
ఈ క్లాక్ పైన ‘ది వాక్ ఆఫ్ ది అపోస్టల్స్‘ తెరవడానికి 2 బ్లూ డోర్స్ ఉండటం మనం గమనించవచ్చు.ఇవి ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల మధ్య ప్రతీ గంటకు పైభాగంలోని క్లాక్ విండోలో 12 మంది అపోస్టల్స్ కదులుతున్నట్లు చూపుతుంది.
దానితో పాటు అందులో అంటే క్లాక్ చుట్టూ మరికొన్ని శిల్పాలు అమర్చబడి ఉండటం మీరు చూడవచ్చు.చేతిలో గంట పట్టుకుని కదిలే బొమ్మల్లో ఒకటి మరణాన్ని సూచించగా, ఖగోళ శాస్త్రవేత్త, ఫిలాసఫర్ లేదా క్రానికల్ వంటి ఇతర బొమ్మలు చలనం లేనివిగా మనకు కనిపిస్తాయి.అయినప్పటికీ ఈ బొమ్మల్లో చాలా ప్రతిరూపాలు దాగి ఉన్నాయి అని ప్రత్యక్షంగా చూసినవాళ్లు కొంతమంది చెబుతూ వుంటారు.ఈ క్లాక్ ఓ అద్భుతమైన ఆవిష్కరణ అని అధునూతన వాచ్ మేకర్స్ చెబుతూ వుంటారు.
ఇంకా జీవితంలో ఒక్కసారైనా సందర్శించవలసిన ఓ మ్యూజియం అని కూడా అంటూవుంటారు.