సూర్యాపేట జిల్లా:తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్( BRS ) దొరల పాలనకు స్వస్తి పలికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా పాలనను ఎన్నుకున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.శనివారం ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం గ్రామంలో నిర్వహించే కార్యక్రమానికి వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట జిల్లా మునగాల మండలం
బరాఖత్ గూడెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి( Uttam Padmavathi )తో కలిసి
దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పూజారులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆయన మాట్లడుతూ రాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం తెస్తామని, ప్రజలందరికీ పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు.
ఈకార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.