కంటిచూపు లేని వాళ్లు ఏదైనా పని చేయాలంటే ఇతరుల సహాయసహకారాలు అవసరమనే సంగతి తెలిసిందే.అయితే ఒక యువతి మాత్రం చూపు లేకపోయినా వంటలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఆత్మవిశ్వాసం ఉంటే సక్సెస్ సాధించడం సాధ్యమేనని ఈ మహిళ ప్రూవ్ చేస్తోంది.కర్ణాటకకు( Karnataka ) చెందిన అంధ మహిళ తను వంటలు చేయడంతో పాటు ఆ వంటలను యూట్యూబ్ లో పెడుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈ మహిళ పేరు భూమిక( Bhumika ) కాగా ఆప్టిక్ న్యూరోసిస్ అనే అరుదైన వ్యాధి వల్ల ఈ మహిళ కంటిచూపును కోల్పోయారు.అయితే భూమిక కంటిచూపును కోల్పోయినా ఆమెకు కుటుంబ సభ్యులు సపోర్ట్ ఇవ్వడంతో భూమిక కిచెన్( Bhumika kitchen ) పేరుతో ఆమె యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టారు.
చూపు లేకపోతే జీవితం ముగిసినట్టు కాదని తలచుకుంటే సక్సెస్ సాధించవచ్చని ఆమె ప్రూవ్ చేశారు.భూమిక కిచెన్ యూట్యూబ్ ఛానల్ కు భారీ స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

బ్లైండ్ ఫెండ్లీ కుకింగ్( Blind Fendley Cooking ) అనే వాట్సాప్ గ్రూప్ సహాయంతో ఆమె కూరగాయలను ఏ విధంగా గుర్తించాలి? ఎలా కోయాలి? మసాలా దినుసులను ఎలా గుర్తించాలి? అనే విషయాలను తెలుసుకున్నారు.ప్రస్తుతం ఈమె యూట్యూబ్ ఛానల్ కు 83,200 మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారు.ఆమె పెట్టిన కొన్ని వీడియోలకు రికార్డు స్థాయిలో వ్యూస్ రాగా మరికొన్ని వీడియోలకు ఆశించిన రేంజ్ లో వ్యూస్ రావడం లేదు.

నేను చేసిన వంటలను నా భర్త షూట్ చేసి యూట్యూబ్ లో పెడతారని భూమిక చెప్పుకొచ్చారు.అత్తామామ మద్దతు కూడా నాకు ఉందని భూమిక కామెంట్లు చేశారు.భూమిక వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భూమిక సక్సెస్ స్టోరీ గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఆమె సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.







