తెలంగాణ సెక్రటేరియట్ లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లాగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లదేనని పేర్కొన్నారు.
ప్రజాపాలన పేరుతో గ్రామ సభను నిర్వహించి లబ్దిదారుల ఎంపిక చేయాలని చెప్పారు.అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదన్న సీఎం రేవంత్ రెడ్డి అట్టడుగులో ఉన్న పేదలకు సంక్షేమం అందించే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు.
అలాగే అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే కబ్జాదారులపై కఠినంగా వ్యవహారించాలన్నారు.
ఇకపై భూ కబ్జా అనే పదం కూడా రాష్ట్రంలో వినిపించకూడదని వెల్లడించారు.అదేవిధంగా బుక్ మై షో సన్ బర్న్ నిర్వహణతో పాటు నాసిరకం విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.