రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఈ నెల 3 వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా చూసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.
ఈవీఎంలలో భవితవ్యంరాజన్న సిరిసిల్ల జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఈనెల 3న తేలిపోనుంది.
ఆ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది.అదే రోజు సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
లెక్కింపునకు ఏర్పాట్లు3న జరగనున్న ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
సిరిసిల్ల, వేములవాడ ( Sirisilla, Vemulawada )అసెంబ్లీనియోజకవర్గాలకు అదే పాఠశాలలో వేరు వేరు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఒక్కో నియోజకవర్గంలో 14+1 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
లెక్కింపులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు లెక్కించనున్నారు.
పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కు 3 టేబుల్ లను ఏర్పాటు చేసి ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి చేస్తారు.సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం కు 4 టేబుల్ లను ఏర్పాటు చేసి ఒకే రౌండ్ లో లెక్కింపు పూర్తి చేస్తారు.
ప్తి అసెంబ్లీ నియోజకవర్గం కౌంటింగ్ హాలులో 14 టేబుల్ లను ఏర్పాటు చేయనున్నారు.ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా విధులు నిర్వహిస్తారు.
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 21 రౌండ్లు, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 19 రౌండ్ల లో ఈవీఎంలలో నీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తారు.ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారీ భద్రతతంగల్లపల్లి మండలం బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వ్, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారుఎన్నికల కమిషన్ అనుమతి ఉన్నవారికే స్ట్రాంగ్ రూమ్స్ లోకి అనుమతి ఇస్తున్నారు.
స్ట్రాంగ్ రూం ల వద్ద 24 * 7 పటిష్ట నిఘా , భద్రతను ఏర్పాటు చేశారు.