తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల కలిసొచ్చే దానికంటే నష్టం ఎక్కువ జరుగుతుందనే అంచనాకు టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు( Chandrababu ) వచ్చారు.
అయితే తెలంగాణ టిడిపి అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ( Gnaneshwar )మాత్రం కచ్చితంగా ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను పోటీకి దించాలని భావించారు.దరఖాస్తులు స్వీకరించడంతో పాటు , దాదాపు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారు.
చంద్రబాబు అనుమతితో ఇక అభ్యర్థుల లిస్టు ప్రకటిద్దామని భావించే ఆయనతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ములకత్ అయ్యారు.అయితే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలంటూ కాసాని జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు నచ్చచెప్పి ప్రయత్నం చేశారు.
ఇదే విషయాన్ని తెలంగాణ టిడిపి కార్యవర్గ సమావేశంలో కాసాని పార్టీ నాయకులకు వివరించారు.అయితే పోటీకి దూరంగా ఉండే విషయంపై తెలంగాణ టిడిపి తమ్ముళ్లు మాత్రం విభజించారట.
ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలతో తెలంగాణ రాజకీయాలను ముడిపెట్టడం ఏమిటని ప్రశ్నించారట.అన్ని నియోజకవర్గాల్లో టిడిపి( TDP ) పోటీ చేస్తుందని స్వయంగా చంద్రబాబు చెప్పినా, తాము నియోజకవర్గాల్లో కష్టపడి పనిచేస్తున్నామని, ఇప్పటికే భారీగా సొమ్ములు ఖర్చు పెట్టామని, ఇప్పుడు ఎన్నికల ముందు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం మంచిది కాదంటూ వారు నిలదీశారట.తెలంగాణలో టిడిపి పోటీ చేసే విషయంలో చంద్రబాబుతో మరోసారి సమావేశమై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కొంతమంది నేతలు జ్ఞానేశ్వర్ కు సూచించారు.దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ అటు అధినేత చంద్రబాబు( Chandrababu ) మాట కాదనలేక ఇటు తెలంగాణ టిడిపి నేతలు నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆ సమావేశంలోని కన్నీళ్లు పెట్టుకున్నారట పార్టీ తరఫున పోటీ చేయడం సాధ్యం కాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా నైనా పోటీలో ఉంటామంటూ కొంతమంది నేతలు ఆ సమావేశంలోని తేల్చి చెప్పారట.
ఇదే విషయంపై తీర్మానం కూడా చేశారట.ఇదే తీర్మానాన్ని మరోసారి చంద్రబాబు ముందు ఉంచి చర్చించాలని ,పోటీకి ఒప్పించాలని కాసాని జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేస్తున్నారట.నవంబర్ మూడో తేదీన తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో, అప్పటిలోగా సానుకూలంగా చంద్రబాబు నిర్ణయం తీసుకునే విధంగా ఆయనతో ములాఖాత్ అయ్యి ఒప్పించాలని కాసాని పై ఒత్తిడి పెంచుతున్నారట.