సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రమంతటా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం( Chivvemla Mandal )లో ఎన్నికల కోడ్అమలు జరగడం లేదని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మండల పరిధిలో ఎక్కడా చూసినా రాజకీయ పార్టీల ప్లెక్సీలు,శంకుబండలు దర్శనమిస్తూ ఎన్నికల నిబంధనల లోపాలను ఎత్తి చూపుతున్నాయి.
గ్రామాలలో ఎన్నికల కోడ్( Election Code ) అమలు కాకపోవడానికి స్థానిక అధికారుల నిర్లక్ష్యమా ? లేక ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమా అర్దం కాక మండల ప్రజలు అయోమయంలో పడ్డారు.
ఇదిలా ఉంటే మండలంలో ఏ గ్రామంలో చూసినా బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
ఇదంతాప్రతిరోజు గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులకు తెలియదా? తెలిసినా చూసిచూడనట్లు వదిలేస్తున్నారా అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో బజారుకు నాలుగు బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నా ఎన్నికల అధికారులు,ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు పట్టదా అంటూ విస్తుపోతున్నారు.
జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు డబ్బులు,మద్యం పంపిణీ చేసే అవకాశం ఉందని, ఇప్పుడే పరిస్థితి ఇట్లా ఉంటే ముందు ముందు ఇంకేం కట్టడి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఎన్నికల అధికారి( Money ) స్పందించి చివ్వెంల మండలంలో అమలు జరుగుతున్న ఎన్నికల నిబంధనలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసి, ఎన్నికల కోడ్ ను సంపూర్ణంగా అమలు చేయాలని కోరుతున్నారు.