వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిఆర్ఎస్( BRS party ) అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM kcr )ప్రజలకు అనేక వరాలు ఇస్తున్నారు.గతంలో ఇచ్చిన హామీలు ఎన్నో అమలు కాకపోవడంతో, ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో, వాటిని ఇప్పుడు అమలు చేస్తున్నారు.
దీంతో పాటు, కొత్త కొత్తగా అనేక పథకాలను ప్రకటిస్తూ, అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరిచే విధంగా కెసిఆర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందనే విషయం పైన ప్రత్యేకంగా సర్వే చేయించి, దానికి అనుగుణంగా నిర్ణయాలను తీసుకుంటున్నారు కొత్తగా అనేక పథకాలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.ముఖ్యంగా రైతులకు రుణమాఫీ ( Crop Loan Waiver ) బీసీలకు సాయం, చేతి వృత్తులకు చేయూత, ముస్లింలకు లక్ష సాయం, నిరుద్యోగులకు జాబ్ నోటిఫికేషన్లు , ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ వంటి నిర్ణయాలు ఎన్నిటినో ప్రకటించారు .
ఇక పార్టీలో చేరికల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. బిజెపి , కాంగ్రెస్ ( BJP, Congress )లోని కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ వ్యవహారం ఇలా ఉంటే .చాలా కాలంగా ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారు.ఈ మేరకు వచ్చే వారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కామన్నారు.ఈ సందర్భంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పీఆర్సి, ఐ ఆర్, తదితర అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు బీ ఆర్ ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇది ఎలా ఉంటే చాలా కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రదర్శనలకు కేసిఆర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.
తమ సమస్యలను చెప్పుకుని పరిష్కారం పొందేందుకు ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నా, ఆ అవకాశం దొరకడం లేదు .దీంతో కేసీఆర్ ( CM kcr )వ్యవహారాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉండడం , వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉండడంతో కేసీఆర్ ఇప్పుడు వారిని బుజ్జగించే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు .వారితో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.ఉద్యోగుల కోరిన డిమాండ్లను నెరవేర్చి వారి పూర్తి మద్దతు తమకు ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.