నగరి వైసీపీ ఎమ్మెల్యే , మంత్రి ఆర్కే రోజా( RK Roja ) పరిస్థితి ప్రస్తుతం వైసీపీలో బాగానే ఉన్నా.వచ్చే ఎన్నికల్లో ఆమెకు మళ్ళీ నగిరి టికెట్ దక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది.
చాలా కాలం గా నగిరి నియోజకవర్గం వైసీపీ( YCP party )లో గ్రూపు రాజకీయాలు ఉన్నాయి.రోజాకు వ్యతిరేకంగా రెండు గ్రూపులు పనిచేస్తున్నాయి.
రోజాకు టికెట్ ఇవ్వవద్దని, ఇస్తే ఓటమి ఖాయం అనే విధంగా సొంత పార్టీలోని ఆమె ప్రత్యర్థులు సంకేతాలు ఇస్తున్నారు.అది కాకుండా సీనియర్ నేత ,జగన్ కు అత్యంత సన్నిహితుడైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం రోజా విషయంలో సానుకూలంగా లేకపోవడంతో, ఆమె రాజకీయ భవిష్యత్తుపై అనుమానాలు కలుగుతున్నాయి.
వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి రోజాకు కాకుండా మరో వ్యక్తికి టికెట్ ఇచ్చే విధంగా రామచంద్ర రెడ్డి ప్రయత్నిస్తున్నారని, వేరే వారికి అప్పుడే హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతో 2019 లో అతి కష్టం మీద రోజా గెలిచారు.
గెలిచిన దగ్గర నుంచి పార్టీ శ్రేణులను కలుపుకు వెళ్లడం లేదనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. రోజాతో సంబంధం లేకుండా నగర నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులు ఉన్న కొంతమంది కీలక నేతలు అన్ని వ్యవహారాలు చక్కబెడుతుడడం పై రోజు సైతం తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు.ఇదే విషయంపై జగన్ ( CM jagan )కు సైతం ఫిర్యాదులు గతంలో చేశారు.
ఇక వచ్చే ఎన్నికల్లో రోజాను అభ్యర్థిగా ప్రకటిస్తే ఆమె ఓటమి తప్పదని నివేదికలు రావడం తో నగరి నియోజకవర్గంలో వైసిపి అభ్యర్థిగా ఓ బీసీ నేతను తెరపైకి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకువచ్చారట.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Peddireddy ramachandra Reddy ) రోజా కు మధ్య అంత సఖ్యత లేదు.దీంతో రోజాకు టికెట్ రాకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చక్రం తిప్పుతున్నారట. ప్రస్తుతం రాయలసీమ లోని నాలుగు జిల్లాల బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చూస్తున్నారు.
దీంతో ఆయన మాటే చెల్లుబాటు అయ్యే అవకాశం కనిపిస్తుంది.ఇక ఈనెల 28న నగరి నియోజకవర్గంలో వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా భారీ బల ప్రదర్శనకు రోజా దిగుతున్నారు.ఈ నియోజకవర్గంలో తన పట్టు ఎంత ఉందో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
జగన్ తోనే నగర నియోజకవర్గ టికెట్ రోజాకు ఇస్తున్నామనే ప్రకటన చేయించాలనే పట్టుదలతో ఆమె ఉన్నారు.