ఈ మధ్య కాలంలో అవయవ దానం( Organ Donor ) అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది.అయితే అవయవ దానం చేయడానికి ఇష్టపడే వాళ్ల కంటే ఇష్టపడని వాళ్లే ఎక్కువగా ఉన్నారు.
అవయవాలు దానం చేస్తే వచ్చే జన్మలో అవయవ లోపంతో పుడతారంటూ కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి.అయితే సీతా మహాలక్ష్మి( Sita Mahalakshmi ) అనే ఒక మహిళ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 వేల మందిని అవయవదానానికి ఒప్పించారు.
ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని సీతామహాలక్ష్మి తన లక్ష్యాన్ని సాధించడంతో పాటు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.పశ్చిమ గోదావరి జిల్లాలోని( West Godavari ) ఉండికి చెందిన సీతామహాలక్ష్మి ఏడో తరగతిలోనే నాన్న ఇచ్చిన డబ్బులతో ఒక ముసలాయనకు వైద్యం చేయించానని డాక్టర్ కావాలని అనుకున్నా పేదరికం వల్ల అనుకున్నది సాధించలేదని ఆమె అన్నారు.
టీటీసీ చేసి 18 ఏళ్లకే టీచర్( Teacher ) నయ్యానని ఆమె పేర్కొన్నారు.
భర్త రాజేంద్ర ప్రసాద్ ఇంజనీర్ అని ఆమె అన్నారు.32 ఏళ్ల వయస్సులో ఆస్పత్రిలో చేరగా పక్కనే ఐదేళ్ల పిల్లాడు రెండు కిడ్నీలు పాడై( Kidney Failure ) దాతలు దొరక్క చనిపోయాడని ఆ సమయంలో మరణం తర్వాత నా శరీరం ఆంధ్ర వైద్య కళాశాలకు చెందేలా అంగీకార పత్రం రాసిచ్చానని ఆమె అన్నారు.ఆ తర్వాత నా కుటుంబ సభ్యులు సైతం అంగీకార పత్రాలు ఇచ్చారని ఆమె తెలిపారు.
శరీరం దానం కోసం వెళ్తే ఎంతోమంది అవమానించారని సీతామహాలక్ష్మి అన్నారు.
ప్రజలను చైతన్యపరచడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని ఆమె అన్నారు.అనాథ పిల్లలను, ఒంటరి తల్లీదండ్రులు ఉన్నవాళ్ల పిల్లలను చదివిస్తున్నానని సీతామహాలక్ష్మి తెలిపారు.అలా చదువుకున్న పిల్లలలో ముగ్గురు ఇంజనీర్లు, ముగ్గురు డాక్టర్లు అయ్యారని ఆమె చెప్పుకొచ్చారు.
ఉండికి చెందిన సీతా మహాలక్ష్మి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.