సూపర్ స్టార్ రజినీకాంత్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.రజినీకాంత్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilip Kumar ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”జైలర్”( Jailer ).
ఇక సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమాలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించారు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది అనే టాక్ వినిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఈ వయసులో కూడా సరైన కథ పడితే సూపర్ స్టార్ ను ఎవరు కూడా బీట్ చేయలేరు అని రజనీకాంత్ మరోసారి నిరూపించారు.కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీతో పాటు సూపర్ స్టార్ కెరీర్ లో కూడా ఇది బిగ్గెస్ట్ రికార్డులను నెలకొల్పేలా కనిపిస్తుంది.
మరి ఇప్పటికే 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
మూడు రోజుల్లోనే రజనీకాంత్( Rajinikanth ) జైలర్ మూవీ 100 కోట్ల మార్క్ చేరుకోవడం మరో అరుదైన విషయం.ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా పాల్గొంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఈ సినిమాపై మరింత హైప్ పెంచేస్తున్నాడు.ఇప్పటికే వచ్చిన వార్తలు వైరల్ కాగా ఇప్పుడు మరోసారి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
నెల్సన్ తన డ్రీమ్ గురించి చెప్పుకొచ్చాడు.తనకు ఇద్దరు స్టార్స్ తో మూవీ చేయాలని ఉందంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు.వారు ఎవరంటే సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ దళపతి ( Rajinikanth, Vijay Dalapathy )అంటే ఎంతో ఇష్టం అని ఈ ఇద్దరి హీరోలతో ఒక సినిమా చేయాలని ఆలోచన ఉందని పక్కాగా ఇద్దరి ఇమేజ్ కు తగ్గ క్యారెక్టర్స్, స్క్రిప్ట్ వర్కౌట్ అయ్యేలా రాయడం ఈజీ కాదని ఛాన్స్ వస్తే ఒక సినిమాను చేస్తా అంటూ చెప్పుకొచ్చారు.