ఒడిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఎప్పటికీ మరచిపోలేనిది.ఇక పెద్ద సంఖ్యలో ఎంతోమంది గాయపడ్డారు.
ఎన్నో కుటుంబాలు ఆ విషాద సంఘటన నుండి ఇప్పటికీ బయటకి రాలేకపోతున్నారు.అయితే ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) లో ఓ రైలు పెద్ద ప్రమాదం నుండి తప్పించుకుంది.
ఓ రైతు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు.అసలు ఏం జరిగిందో అని వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
భోలకాపురా గ్రామానికి చెందిన భన్వర్ సింగ్ అనే రైతు( Bhanwar Singh ) ఆగస్టు 4న ఉదయం పొలానికి బయలుదేరాడు.ఇతను తన పొలానికి వెళ్లాలంటే మార్గమధ్యంలో ఒక చోట రైలు పట్టాలను దాటాల్సి ఉంటుంది.
భన్వర్ సింగ్ రైలు పట్టాలు దాటుతూ ఉండగా ఒకచోట రైలు పట్టాలు విరిగిపోయి ఉండడం గమనించాడు.
అతను కాస్త దగ్గరగా వెళ్లి చూస్తే రైలు పట్టాలు పగిలిపోయి కనిపించాయి.అప్పటికే ప్రయాగ్ రాజ్ నుంచి బయల్దేరిన గోమతి ఎక్స్ ప్రెస్( GOMTI EXPRESS ) రైలు అదే ట్రాక్ పై వస్తోంది.ఆ రైలును గమనించిన రైతు ప్రమాదం జరగవచ్చు అని ఊహించి ఎలాగైనా ఈ ప్రమాదాన్ని ఆపాలనుకున్నాడు.
అదృష్టవశాత్తు ఆ రైతు వద్ద ఎర్రటి వస్త్రం ఉండడం, ఎర్రటి వస్త్రం చూపిస్తే రైలు ఆగుతుంది అనే విషయం ఆ రైతుకు తెలియడం ద్వారా ఘోర ప్రమాదం తప్పింది.ఆ రైతు ఎర్రటి వస్త్రాన్ని గాల్లో ఊపుతూ రైలు ఆపాలని కేకలు వేయడంతో ఇతన్ని గమనించిన లోకో పైలట్ ట్రైన్ ఆపేశాడు.అనంతరం లోకో పైలట్( Loco Pilot ) ఆ రైతు ఎందుకు ట్రైన్ ఆపాడో అని కిందికి దిగి చూసి రైలు పట్టాలు విరిగిపోయి ఉండడం కనిపించాక షాక్ అయ్యాడు.పెద్ద ప్రమాదం జరుగకుండా కాపాడినందుకు రైతును అభినందించాడు.
అధికారులు కాసేపు ట్రైన్ రాకపోకలను ఆపేశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చేరడంతో అధికారులతో పాటు నెటిజన్స్ ఆ రైతును అభినందిస్తున్నారు.