రాజన్న సిరిసిల్ల జిల్లా :నీట మునిగిన బాధిత కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేశారు.ఎల్లారెడ్డిపేట( Ellareddypet ) మండలంలోని దుమాల గ్రామంలో భారీ వర్షాలకు ఐదు ఇండ్లలో నీరు చేరగా వారి కుటుంబాలకు నిత్యవసర సరుకులను మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి గురువారం పంపిణీ చేశారు.
గత మూడు రోజుల నుండి విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగు ప్రక్కన ఉన్న బాలసంతల కుటుంబాలకు చెందిన వీరి ఇళ్లలోకి నీరు వచ్చి ఇళ్లలోని వస్తువులన్నీ తడిసిపోయి చెల్లాచెదురయ్యాయి.స్పందించిన రవి, గుర్రం భాను వీరికి నిత్యవసర సరుకులను అందించడం జరిగింది.
ఇదే గ్రామానికి చెందిన ఉల్లి దేవయ్య, ఇఫ్తార్, పెంటయ్య,పెద్దమ్మ నారాయణ ఇండ్లలోకి వర్షపు నీరు చేరి ఇండ్లలోని వస్తువులన్నీ తడిసిపోవడం జరిగిందని పేర్కొన్నారు.ప్రభుత్వం వీరి కుటుంబాలను ఆదుకోవాలని అనవేని రవి డిమాండ్ చేశారు.