టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని( Akhil Akkineni ) గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.
అయితే అఖిల్ ఎప్పటినుంచో సరైన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు.ఇదిలా ఉంటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్.
( Agent ) అనిల్ సుంకర రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈనెల 28 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్స్ కి ప్రేక్షకుల నుంచి విశేషంగా స్పందన లభించింది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.కాగా అఖిల్ కెరియర్ లోనే హైయెస్ట్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమైన విషయం తెలిసిందే.
అంతే కాకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు డినో మోరియా( Dino Morea ) విలేకరులతో ముచ్చటించారు.
ఈ సందర్భంగా డినో మోరియా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమాలో నేను రా మాజీ ఏజెంట్ ది గాడ్ పాత్రలో నటించాను.డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎంపైర్ చూసి నాకు ఈ ఏజెంట్ సినిమాలో అవకాశాన్ని ఇచ్చారు.ప్రతి సన్నివేశంలో నా నుంచి ఆయన మోర్ ఎనర్జీని కోరుకునేవారు అని చెప్పుకొచ్చారు.
తెలుగు భాష రాకపోవడం అన్నది నా బలహీనతగా అనిపించింది.తెలుగు ఫాన్స్ తమ స్టార్స్ కోసం ప్రాణం ఇస్తారు.
బాలీవుడ్ లో ఇది అంతగా కనిపించదు.చిరంజీవి అభిమానులు రామ్ చరణ్ ని నాగార్జున అభిమానులు అఖిల్ ని అభిమానిస్తున్నారు.కానీ బాలీవుడ్లో నెపోటిజం ( Nepotism ) అంటే ఒప్పుకోను.అది బెంగుళూరు.బాలీవుడ్ లో ఎవరూ లేకుండా ముంబై వెళ్లి అవకాశాలు సంపాదించుకొని ఇప్పుడు నటుడుగా మంచి స్థాయిలో ఉన్నాను అని చెప్పుకొచ్చారు డినో మోరియా. ఆయన చేసిన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.