పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తూ పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ సర్ప్రైజ్ లు ఇస్తున్నాడు.ఈ మధ్య కాలంలోనే వరుసగా సినిమాలు ప్రకటించడమే కాకుండా షూట్ కూడా పూర్తి చేస్తున్నాడు.
మరి ఈయన నటిస్తున్న సినిమాల్లో ఒక రీమేక్ మూవీ కూడా ఉంది.తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ) తో కలిసి ఒక సినిమాను అనౌన్స్ చేసాడు.
తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వినోదయ సీతం ( Vinodhaya Sitham ) రీమేక్ ను వీరిద్దరి కలయికలో తెరకెక్కుతుంది.యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమా ఒరిజినల్ ను కూడా తమిళ్ లో ఈయనే నటించి తెరకెక్కించాడు.ఆయన చేసిన పాత్రనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగులో చేస్తున్నాడు.
పీపుల్స్ మీడియా బ్యానర్ తో కలిసి ఈ సినిమాను త్రివిక్రమ్ నిర్మిస్తున్నాడు.అలాగే ఈ సినిమా స్క్రిప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేయడంలో త్రివిక్రమ్ సహకారం కూడా ఉంది.ఇక థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడు.ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన షూట్ ను పూర్తి చేసాడు.
ఇక తాజాగా ఈ షూట్ గురించి ఒక అప్డేట్ వినిపిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగానే షూట్ పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో నైట్ షూట్ జరుగుతుంది అని తెలుస్తుంది.ఈ సినిమా జులై 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్న క్రమంలో వీలైనంత త్వరగా షూట్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
చూడాలి విరూపాక్ష ( virupaksha ) తో అదిరిపోయే హిట్ అందుకున్న సాయి తేజ్ మామతో కలిసి మరో హిట్ అందుకుంటాడా లేదా.