చంద్రబాబుపై రాళ్ల దాడి.. పవన్ స్పందన ఏంటంటే ..? 

నిన్న టీడీపీ ఎంత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం లో పర్యటించారు.ఈ పర్యటన సందర్భంగా చంద్రబాబు కాన్వాయ్ కొంతమంది రాళ్ల దాడికి పాల్పడ్డారు.

 Stone Attack On Chandrababu What Is Pawan's Response, Pavan Kalyan, Cbn, Chandra-TeluguStop.com

ఈ ఘటన పై వెంటనే అప్రమత్తం అయిన ఎన్ ఎస్ జీ సిబ్బంది చంద్రబాబుపై రాళ్లు పడకుండా బుల్లెట్ ప్రూఫ్ షీట్లను అడ్డుగా పెట్టారు .ఈ క్రమంలో ఎన్ ఎస్ జీ  కమాండర్ సంతోష్ కుమార్( NSG Commander Santosh Kumar ) కు గాయాలయ్యాయి.అలాగే కొంతమంది టిడిపి కార్యకర్తలకు ఈ ఘటనలో గాయాలు అయ్యాయి.ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం ఎదుటే వైసిపి నేతలను ఆయన హెచ్చరించారు.ఈ క్రమంలో టిడిపి కార్యకర్తలను పోలీసులు నెట్టి వేయడంతో తీవ్ర వాగ్వాదం  చోటుచేసుకుంది.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Ysrcp-Politics

ఈ వ్యవహారంపై పోలీసులు పైన చంద్రబాబు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు పై రాళ్లదాడి ఘటన ఏపీలో తీవ్ర దుమారమే రేపింది.ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా స్పందించారు .చంద్రబాబుపై రాళ్లదాడి సంఘటనను ఖండిస్తూ వైసిపి ప్రభుత్వం ( YSP )పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ప్రతిపక్షాలను చూస్తే జగన్( Jagan ) ప్రభుత్వానికి ఎందుకు అంత అభద్రతా భావం అంటూ పవన్ నిలదీశారు.అధికారపక్షం బాధ్యత విస్మరించిన చోట కచ్చితంగా ప్రతిపక్షం ప్రజల కోసం నిలబడుతుందని పవన్ అన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కీలక భూమి కానీ,  ప్రతిపక్ష పార్టీలను నిలువరించాలని చూస్తే ప్రజాస్వామ్యం స్ఫూర్తి దెబ్బతింటుందని పవన్ అన్నారు.చంద్రబాబుపై రాళ్ల దాడి ఖండిస్తూ ప్రతిపక్ష నాయకుల పర్యటనకు తగిన భద్రత కల్పించడం పై పోలీసు ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కోరారు.

Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Pavan Kalyan, Ysrcp-Politics

ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలను చూసి వైసిపి ప్రభుత్వం ఎందుకు ఇంత అభద్రతా భావానికి లోన అవుతుందో తనకు అర్థం కావడంలేదని , వైసిపి పాలకులు తమ పాలన ప్రజాహితంగా ఉందని భావించి ఉంటే,  ఇలాంటి అభద్రతకు గురై ఉండేవారు కాదని,  ప్రజల కోసం ప్రతిపక్ష పార్టీలు మాట్లాడే ప్రతి సందర్భంలో అధికార పార్టీ నేతలు అసహనానికి గురవుతున్నారని పవన్ మండిపడ్డారు.తాను విశాఖలో జనవాణి కార్యక్రమానికి వెళ్లిన సందర్భంగా కొన్ని వ్యవస్థలను వాడుకుని ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో అంత చూశారని పవన్ అప్పట్లో తనకు ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube