మన భారతదేశం కూరగాయల సాగులో ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది.వ్యవసాయ క్షేత్ర నిపుణుల అవగాహనతో చాలామంది రైతులు కూరగాయ పంటలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కూరగాయ పంటల వల్ల ఏడాది పొడవునా ఆదాయం వస్తూనే ఉంటుంది.కాప్సికం ను కూరమిరప, బెంగుళూరు మిరప, గ్రీన్ పెప్పర్, బెల్ పెప్పర్, స్వీట్ పెప్పర్, సిమ్లా మిర్చి లు గా పిలుస్తారు.
అంటే వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. కాప్సికంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం లతోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి.
కాప్సికంలో మేలు రకం విత్తనాలను ఎంచుకొని కొన్ని సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే, ఒక్కో కాప్సికం 150 గ్రాముల బరువుతో దిగుబడి పొందవచ్చు.కాప్సికం ఆరు బయట నెలల్లో పండిస్తే, వాతావరణం కారణంగా చీడపీడల బెడద ఊహించని రీతిలో ఉంటుంది.వీటిని అరికట్టడం కోసం కచ్చితంగా రసాయన మందులను విచక్షణారహితంగా వాడాల్సి వచ్చి పంట నాణ్యత దెబ్బతింటుంది.అదే కాప్సికం ను హరితగృహాల్లో సాగు చేయడం వల్ల చీడపీడల బెడద, రసాయన ఎరువుల అధిక వినియోగం లాంటి సమస్యలు ఉండవు.
రాత్రి 15-18 డిగ్రీల సెంటిగ్రేడ్, పగలు 25-28 డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒక ఎకరం పొలానికి దాదాపుగా 20వేల నారు మొక్కలు అవసరం.కాబట్టి హరితగృహాల్లో దాదాపు 200 గ్రాముల విత్తనాలను పెంచితే సరిపోతుంది.నారు పోసిన 15 నుంచి 20 రోజుల మధ్యలో లీటరు నీటిలో 12:61:0 ను 3 గ్రాములు, తర్వాత నాలుగైదు రోజులకు 19:19:19 ను 3 గ్రాములు మొక్కల మొదల వద్ద పోయాలి.తరువాత నారుపై ఇమిడ క్లోప్రిడ్ 0.2 మిల్లీలీటర్లను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసి, పొలంలో నాటాలి.ఇలా చేస్తే కాప్సికం కాయ బరువు ఆశించిన స్థాయిలో పెరుగుతుంది.తద్వారా మంచి లాభం అర్జించవచ్చు.