తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్లకు ఎంతో మంచి ఆదరణ పేరు ప్రఖ్యాతలు ఉంటాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారు ఉన్నారు.
ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ కమెడియన్ గా దాదాపు 1200 సినిమాలలో కమెడియన్, హీరోగా నటించిన వారిలో నటుడు అలీ ఒకరు.సినిమాలు అలీ ఉన్నారు అంటే తన కామెడీ మరో లెవల్ అని చెప్పాలి.
ఇలా తన అద్భుతమైన కామెడీతో పంచ్ డైలాగులతో ఎందరినో మెప్పించిన అలీ ప్రస్తుతం ఇండస్ట్రీకి కాస్త దూరంగానే ఉంటున్నారు.
కేవలం కథ ప్రాధాన్యత ఉన్నటువంటి సినిమాలలో మాత్రమే అలీ నటిస్తున్నారు.ఎన్నో సినిమాలలో నటించారు.అయితే హీరోగా మాత్రం యమలీల సినిమాలో నటించి మెప్పించారు.
ఈ సినిమాకు మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వం వహించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎస్ వి కృష్ణారెడ్డి మాట్లాడుతూ అలీతో యమలీల సినిమా అనుకున్న సమయంలో ఇందులో ఆలీ పక్కన నటించడం కోసం హీరోయిన్ సౌందర్యను అనుకున్నట్లు తెలిపారు.
అప్పటికే సౌందర్య స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరి సరసన నటిస్తున్నారు.ఇలా స్టార్ హీరోల పక్కన నటించే సౌందర్య అలీ పక్కన హీరోయిన్గా నటించడం కోసం కాస్త సంకోచించారు.అయితే ఈ సినిమాలో నటించలేనని మర్యాదపూర్వకంగా ఈ సినిమాని రిజెక్ట్ చేశారు.
ఇక ఈ సినిమాలో సౌందర్య నటించనని చెప్పడంతో ఇంద్రజ సెలెక్ట్ అయ్యారు.అయితే ఈ సినిమా విడుదలయ్యి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఈ సినిమాల్లో అలీ పక్కన నటించలేకపోయినందుకు సౌందర్య ఎంతో బాధపడ్డారట.
ఈ విషయాన్ని కృష్ణారెడ్డికి సౌందర్య తండ్రి చెప్పారని ఈయన తెలియజేశారు.ఇలా ఆలీ పక్కన నటించడానికి రిజెక్ట్ చేసి ఎంతో బాధపడినటువంటి సౌందర్య తిరిగి ఆలీ పక్కన నటించాలని పట్టుబడ్డారట.
ఈ క్రమంలోనే ఆమెతో శుభలగ్నం సినిమాలో అలీతో కలిపి చినుకు చినుకు అందెలతో పాటలో డాన్స్ చేసే అవకాశాన్ని కల్పించామని ఈ సందర్భంగా కృష్ణారెడ్డి సౌందర్య గురించి యమలీల సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.