పాదాల పగుళ్లు..
చాలా మందిని మదన పెట్టే కామన్ సమస్యల్లో ఒకటి.అయితే కొందరిలో పాదాల పగుళ్ల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంటుంది.
ఎంతలా అంటే నడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతుంటారు.అడుగు తీసి అడుగు వేయడానికి తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.
దాంతో పాదాల పగుళ్లను నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు లిస్ట్ లో ఉన్నారా.? డోంట్ వర్రీ.పైసా ఖర్చు లేకుండా ఉల్లిగడ్డ తో పాదాల పగుళ్లను మాయం చేసుకోవచ్చు.
అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.
ఈ తురుము నుంచి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి.
అలాగే రెండు టేబుల్ స్పూన్లు వైట్ టూత్ పేస్ట్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేయాలి.
చివరిగా ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు ఉల్లిగడ్డ జ్యూస్ ను వేసి నాలుగైదు నిమిషాల పాటు స్పూన్ సహాయంతో కలుపుతూనే ఉండాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పాదాల పగుళ్లు పై అప్లై చేసుకుని.కనీసం ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు పాదాలను ఆరబెట్టుకోవాలి.అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా పాదాలను క్లీన్ చేసుకోవాలి.
రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ చిట్కాను కనుక పాటిస్తే కొద్ది రోజుల్లోనే పాదాల పగుళ్లు మాయమవుతాయి.పాదాలు మళ్లీ మృదువుగా, కోమలంగా మారతాయి.పాదాల పగుళ్ల సమస్యను వదిలించడానికి ఈ చిట్కా ఎంతో ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.మరియు వేగంగా రిసల్ట్ ను ను అందిస్తుంది.కాబట్టి ఎవరైతే పాదాల పగుళ్ల సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారో.వారు తప్పకుండా ఉల్లిగడ్డ తో పైన చెప్పిన రెమెడీని పాటించండి.