తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 రేటింగ్ ను పెంచేందుకు నిర్వాహకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే టాస్క్ ల విషయంలో ప్రేక్షకులు నిరాశతో ఉన్నారు.
అందుకే గెస్ట్ హోస్ట్ లేదా మరో రకంగా అన్నట్లుగా రేటింగ్ ను పెంచేందుకు బిబి టీం ప్లాన్స్ వేస్తూనే ఉన్నారు.అందులో భాగంగానే దసరా రోజు ప్రత్యేకంగా ఎపిసోడ్ ను డిజైన్ చేసి భారీ రేటింగ్‌ను దక్కించుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఖచ్చితంగా సమంత హోస్ట్‌గా రాబోతుందని దాంతో షోకు అదిరిపోయే రేటింగ్ రావడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.ఇక దానికి తోడు రేపటి ఎపిసోడ్ ను ఏకంగా మూడు గంటల పాటు కొనసాగించబోతున్నారట.
రేపు బిగ్ బాస్ సాయంత్రం 6 గంటలకు ప్రత్యేకంగా షో ప్రారంభం కాబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి.నేడు హోస్ట్ లేకుండా సాదారణంగా షో సాగబోతుంది.నేడు చిత్రీకరణ చేస్తారా లేదా అనే విషయం లో క్లారిటీ లేదు.
ఆదివారం ఎపిసోడ్‌ను చిత్రీకరించి సాయంత్రంకు ప్రసారం చేస్తారా అనేది కూడా మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.మొత్తానికి బిగ్‌బాస్ సీజన్ 4 దసరా సందర్బంగా ప్రేక్షకులను రెట్టింపు ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
షో నిర్వాహకులు రేటింగ్‌ను దక్కించుకునేందుకు గాను ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు.నాగార్జున షూటింగ్ కోసం మనాలీలో ఉన్నాడు.
అందుకే సమంత రంగంలోకి దిగబోతుంది అంటున్నారు.అసలు విషయం ఏంటీ అనేది మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం షో కు ఉన్న రేటింగ్ రేపటి ఎపిసోడ్ తో డబుల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.గత సీజన్ లో రమ్యకృష్ణ హోస్ట్‌గా చేసింది.
ఈ సీజన్ లో కూడా గత రెండు మూడు వారాలుగా గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఈ వారం అది వర్కౌట్ అవ్వబోతుంది.
రేపు సాయంత్రం 6 గంటలకే అంటూ ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.మరి షో కు హోస్ట్ ఎవరు అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.