అత్తారింటికి దారేది సినిమా వల్ల నాకు అన్ని రూ.కోట్ల నష్టం.. ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరైన వివి రాజ్ కుమార్ ( VV raj kumar )తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అవకాశాల కోసం చాలామంది డైరెక్టర్లను కలిశానని తెలిపారు.ఒక్క సినిమా ఇవ్వాలని రాఘవేంద్రరావు( Raghavendra Rao ) గారిని అడిగానని ఆయన పేర్కొన్నారు.

 Vv Raj Kumar Comments About Attarintiki Daredi Details Here Goes Viral In Social-TeluguStop.com

ఆయన వల్ల ఈటీవీలో మనోయజ్ఞం సీరియల్ లో చేసే ఛాన్స్ వచ్చిందని రాజ్ కుమార్ అన్నారు.ఆ సీరియల్ రెండు షెడ్యూల్స్ కు రాఘవేంద్రరావు డైరెక్టర్ గా పని చేశారని ఆయన తెలిపారు.

సీరియల్ ప్రొడక్షన్ లోకి వెళ్లి ఉంటే నేను కచ్చితంగా సక్సెస్ అయ్యేవాడినని రాజ్ కుమార్ కామెంట్లు చేశారు.ఆరోజుల్లో 30 లక్షల రూపాయలతో గొప్ప సీరియల్ తీయొచ్చని పదేళ్ల క్రితం స్థితిని ఆయన పేర్కొన్నారు.

రియాలిటీకి దగ్గరగా ఉండాలని క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావాలని నేను భావించానని రాజ్ కుమార్ వెల్లడించారు.నేను హీరోగా, నిర్మాతగా బారిష్టర్ శంకర్ నారాయణ( Barrister Shankar Narayana ) అనే సినిమాలో చేశానని ఆయన తెలిపారు.

Telugu Pawan Kalyan, Raghavendra Rao, Tollywood, Vv Rajkumar-Movie

ఆ సినిమాకు మంచి థియేటర్లు దక్కాయని సెప్టెంబర్ 21వ తేదీ 2013 సంవత్సరంలో ఈ సినిమా రిలీజైందని ఆయన చెప్పుకొచ్చారు.నా సినిమా విడుదలైన తర్వాత అత్తారింటికి దారేది లీక్ కావడం ఆ సినిమాను వెంటనే రిలీజ్ చేయడంతో నా సినిమాకు థియేటర్లు పోయాయని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.నా సినిమాకు కేవలం 17 థియేటర్లు మాత్రమే మిగిలాయని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Pawan Kalyan, Raghavendra Rao, Tollywood, Vv Rajkumar-Movie

రెండో వారం తర్వాత థియేటర్లలో సినిమా లేదని రాజ్ కుమార్ అన్నారు.అత్తారింటికి దారేది రిలీజ్ డేట్( Attarintiki Daredi ) మారడం వల్ల నా సినిమాకు నష్టం వచ్చి మూడు కోట్ల రూపాయలు పోయాయని రాజ్ కుమార్ తెలిపారు.ఆ డబ్బులను ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేసినా మరోలా ఉండేదని రాజ్ కుమార్ పేర్కొన్నారు.

జయాపజయాలు దైవాధీనాలు అని నాన్న చెప్పేవారని రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.ఆయన చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube