పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఈ మేరకు పది బిల్లులను ఆమోదించకపోవడంపై సీఎస్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రతివాదిగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను తెలంగాణ ప్రభుత్వం చేర్చింది.రేపు సుప్రీంకోర్టులో మెన్షన్ చేస్తామని సర్కార్ తెలిపింది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు న్యాయస్థానంలో వినిపించనున్నారు.దీంతో రాజ్ భవన్ – తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదిరిందని అర్థం అవుతోంది.