సింగర్ స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న నిజం టాక్ షో కి సంబంధించి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.కానీ ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు సోనీ లివ్ ఎక్కువగా ప్రమోషన్ చేయలేక పోయింది.
మెగా స్టార్ చిరంజీవి, చంద్రబాబు నాయుడు, రానా, నాని ఇంకా ఎంతో మంది స్టార్స్ నిజం టాక్ షో లో సందడి చేసినా కూడా ఎక్కువగా పబ్లిసిటీ చేయలేక పోయారు.వేరే ఓ టి టి లో నిజం షో స్ట్రీమింగ్ అయితే కచ్చితంగా మరో లెవల్ లో ఉండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉంటున్నాయి, అయినా కూడా కొందరు సోనీ లివ్ లో ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఆసక్తి చూపించడం లేదు.అందుకు కారణం ఎక్కువ మంది ఈ కార్యక్రమాన్ని చూసే విధంగా సోనీ లివ్ కి ఖాతాదారులు కాదు.ఆ కారణం గానే చాలా తక్కువ సంఖ్య లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది.
గతం లో వచ్చిన టాక్ షో లకు ఈ టాక్ షో కి వ్యత్యాసం ఉంది, అయినా కూడా ప్రేక్షకులు ఎక్కువ సంఖ్య లో చూడక పోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది.మరి ఇంత తక్కువ పబ్లిసిటీ చేయడమేంటి.అంత పెద్ద సెలబ్రిటీలను తీసుకు వచ్చి ఎందుకు హంగామా చేయడం లేదంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సింగర్స్ స్మిత కి మంచి పాపులారిటీ ఉంది.ఆమె టాక్ షో అంటే కచ్చితంగా మంచి పాపులారిటీ దక్కుతుంది.
కానీ ప్రేక్షకులు మాత్రం సోనీ లివ్ కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలని కోరుకోవడం లేదు.ఇంకాస్త ఎక్కువ ప్రమోషన్ చేస్తే అప్పుడు ఏమైనా ప్రేక్షకులు చూస్తారేమో చూడాలి.