సిద్ధూ జొన్నలగడ్డ కొత్త మూవీ టైటిల్ ఫిక్స్.. 'తెలుసు కదా' అంటున్న యంగ్ హీరో!

గత ఏడాదిలో మన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన సినిమాల్లో ”డీజే టిల్లు( DJ Tillu )” కూడా ఉంది.ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

 Siddhu Jonnalagadda – Neeraja Kona's Telusu Kada Movie Title Announcement, Sid-TeluguStop.com

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ( Siddhu Jonnalagadda ) ఈ సినిమాతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యాడు.ఈయన మొదటి సినిమా తోనే ఆకట్టుకుని యంగ్ హీరోల్లో ఒకరిగా ఫేమస్ అయ్యాడు.

అలా మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్న సిద్ధూ ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ చేస్తున్నాడు.మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాకు ‘టిల్లు స్క్వేర్‘ అనే టైటిల్ ను అనౌన్స్ చేసారు.

ఈ సినిమాలో ఈసారి సిద్ధూ జొన్నలగడ్డ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసారు.ఈ జోడీ ఎలా ఉంటుందో చూడాలని ఆడియెన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా సిద్ధూ మరో సినిమాను అఫిషియల్ గా ప్రకటించారు.

Telugu Neeraja Kona, Raashi Khanna, Srinidhi Shetty, Telusu Kada, Tollywood-Movi

సిద్ధూ నీరజ కోన ( Neeraja Kona )దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.మరి ఈ సినిమాకు ఈ రోజు టైటిల్ ను ప్రకటించారు.”తెలుసు కదా( Telusu Kada ) అనే టైటిల్ ను ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేయగా అదిరిపోయే రేంజ్ లో ఆకట్టు కుంటుంది.ఈ ప్రాజెక్ట్ ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా డిఫరెంట్ ప్రేమ కథగా తెరకెక్కనుంది.లవ్ ట్రాక్ మాత్రమే కాదు, స్నేహం, త్యాగం, కుటుంబం ఇలాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందట.

Telugu Neeraja Kona, Raashi Khanna, Srinidhi Shetty, Telusu Kada, Tollywood-Movi

ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్ లుగా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 15 నుండి ఈ సినిమా రెగ్యురల్ షూట్ షురూ కానుంది.మరి ఇప్పటి వరకు స్టైలిస్ట్ గా పాపులర్ అయిన నీరజ కోన ఇప్పుడు మొదటిసారిగా దర్శకురాలిగా మారనుంది ఈ క్రమంలోనే ఈమె ఈ సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తుందో ఈ యంగ్ హీరోకి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube