అసంపూర్తి పనులతో అవస్థలు పడుతున్న ప్రజలు...!

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండల( Nuthankal ) కేంద్రం నుండి లింగంపల్లి ఎక్స్ రోడ్డు వరకు ఉన్న 4 కి.మీ.రోడ్డు ఆధునీకరణ కోసం రూ.3 కోట్లు మంజూరయ్యాయి.ఈ నిధుల నుండి మండల కేంద్రంలో సిసి రోడ్డు, మురికి కాలువలు, లింగంపల్లి ఎక్స్ వరకు తారు రోడ్డు,మధ్యలో రెండు కల్వర్టర్లు నిర్మించాల్సి ఉంది.8 నెలల క్రితం పనులు మొదలు పెట్టిన హర్ష కంపెనీ కాంట్రాక్టర్ నూతనకల్ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుండి లింగంపల్లి గ్రామానికి వెళ్లే గ్రామ శివారు వరకు సిసి రోడ్డు వేయడం జరిగింది.నూతనకల్ గ్రామ శివారు నుండి లింగంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి వరకు గుత్తేదారుకు అవకాశం ఉండడంతో మెటల్ రోడ్డు పోసి వదిలేశాడు.ఏమైందో ఏమో గానీ ప్రభుత్వం మారగానే హర్ష కంపెనీ కాంట్రాక్టర్ పనులు బంధు చేసి పత్తాలేకుండా పోయాడు.

 People Suffering From Unfinished Works , Nuthankal , People Suffering , Suryape-TeluguStop.com

సంబధిత అధికారులు చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు.

నూతనకల్లు మండల కేంద్రంలో సీసీ రోడ్డు( CC Roads ) రెండు అడుగులు ఎత్తు పోయడం జరిగింది.

రోడ్డుకి ఇరువైపులా మట్టి పోయక పోవడంతో ప్రజలు, ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.రోడ్డు నుండి ఇంటికి వెళ్ళలంటే అనేక అవస్థలు పడాల్సి వస్తుంది.

దీంతో చేసేదేమీ లేక మెయిన్ రోడ్డు పైనే వెహికల్స్ పెట్టి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.దీంతో ట్రాఫిక్ కీ అంతరాయం ఏర్పడుతుంది.

సొంతంగా మట్టి తోలుకోవాలంటే వేలలో డబ్బులు వసూలు చేస్తున్న ట్రాక్టర్ ఓనర్స్.ఇప్పటికైనా అధికారులు స్పందించి సీసీ రోడ్డు పక్కన మట్టి పోసి గ్రామ ప్రజలని,వాహనాదారులని ఆదుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube