కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం కేంద్రానికి అలవాటు విమర్శించారు.గ్యాస్ సిలిండర్ పై రూ.50, కమర్షియల్ సిలిండర్ పై రూ.350 పెంచారని మండిపడ్డారు.మోదీ ప్రభుత్వం రాకముందు గ్యాస్ సిలిండర్ ధర రూ.400 మాత్రమే ఉండేదన్నారు.కానీ ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1200 కు చేరిందని తెలిపారు.పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఎల్లుండి అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ క్రమంలో వినూత్నంగా నిరసన చేయాలన్న కేటీఆర్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.