బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ పాలిత రాష్ట్రాలు, తెలంగాణలో జరుగుతోన్న అభివృద్ధిపై బేరీజు వేసుకుని కేంద్ర మంత్రులు మాట్లాడాలని చెప్పారు.
రాష్ట్రంలో కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని బీజేపీ నేతలు చూడాలని తెలిపారు.
బీజేపీ నేతలు అబద్దాలు చెబుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.