ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి చెందిన చాలామంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడానికి వస్తూ ఉండటంతో కేసరి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
గుజరాత్ రాష్ట్రంలో ఇన్నేళ్లు సేవలు చేసిన.బీజేపీ కార్యకర్తలకు పార్టీ అధిష్టానం ఏమిచ్చిందని ప్రశ్నించారు.
బీజేపీ నుండి ముడుపులు తీసుకొని ఆప్ కోసం పని చేయండి అని పిలుపునిచ్చారు.గుజరాత్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ మరింత బలోపేతం చేసే దిశగా కేజ్రీవాల్ వరుస పర్యటనలు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో సూరత్ లో గుజరాత్ ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో.కేజ్రీవాల్ మాట్లాడుతూ.
పార్టీ విజయం కోసం అందరం కష్టపడి పని చేయాలని పేర్కొన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే నాణ్యమైన విద్య మరియు వైద్యం 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.
అందరితోపాటు బిజెపి పార్టీకి చెందిన కార్యకర్తలకు కూడా ఈ ప్రయోజనాలు అందుతాయని పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో గుజరాత్ రాష్ట్రంలో బిజెపికి ఓటమి భయం పట్టుకుందని చెప్పుకొచ్చారు.
అందువల్లే ఏం చేయాలో తెలియక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలపై ఈడి, సిబిఐ దాడులు చేయిస్తున్నట్లు కేజ్రీవాల్ ఆరోపించారు.ఇటువంటి వాటికి భయపడబోమని అన్యాయానికి అవినీతికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేస్తామని కేజ్రీవాల్ తెలియజేశారు.