రాష్ట్రంలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి వైసీపీ పార్టీలో పలు అభ్యంతరాలు, అసహనాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.
అయితే తాజాగా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే నిర్ణయంతో ఒక రాజధానిని అమరావతి, మరొకటి విశాఖపట్నంలో, ఇంకొకటి కర్నూలులో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టినట్లు పార్టీ వర్గాల్లో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇందులో భాగంగానే లెజిస్లేటివ్ అమరావతిలో, జుడిషియల్ కర్నూలులో, ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నంలో అనే దేశంలోనే ఒక రాష్ట్రానికి మొదటి సారిగా మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు.దీంతో పలు ఎమ్మెల్యే నేతలు ఒక రాజధాని ఒక ప్రదేశంలో ఉంటే ఏదైనా ఎమర్జెన్సీ సమాచారం వస్తే అసెంబ్లీకి ఎలా పంపుతారని అంతేగాక దీనివల్ల పలు రకాల కొత్త సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఇప్పటికే పలువురు నేతలు భావిస్తున్నారు.
ఈ విషయమై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినా కూడా వారి మాటలను బేఖాతరు చేయకుండా ముందుకు వెళ్తున్నట్లు సమాచారం.దీంతో పలువురు నేతలు జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై ఏకీభవించడం లేదట.
అయితే మరి కొందరైతే మాములుగా రాజధాని ఒక ప్రాంతంలోనే ఉంటె ఆ చుట్టూ ప్రక్కల ప్రాంతాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి ఉండదు.దీంతో అన్ని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు(రాయలసీమ, కోస్తా, కోనసీమ) అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయమే సరైందని అంటున్నారు.
అలాగే ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు విషయానికొస్తే ఆ రాష్ట్రంలో రాజధానిగా హైదరాబాదు ఎంతో అభి వృద్ధి చెందింది.కానీ మిగిలిన జిల్లా పరిస్థితి చూస్తే ఒకసారి మీకే అర్థమవుతుందని అంటున్నారు.
కాబట్టి ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు.

అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే రాష్ట్రంలో లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన దిశ చట్టంపై ప్రతిపక్షాల నుంచి ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు.మరికొందరు నాయకులు అయితే దిశ చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాతే రాష్ట్రంలో ఎక్కువ అత్యాచార ఘటనలు జరుగుతున్నాయని వ్యంగంగా విమర్శిస్తున్నారు.అయితే మరి కొందరు ఈ విమర్శలతో ఏకీభవిస్తున్నారు.
ఎందుకంటే దిశ చట్టం అమలు వచ్చినప్పటినుంచి 21 రోజుల్లోపు నిందితులకు శిక్ష పడి అమలు కూడా జరగాలి.కానీ ఇప్పటివరకు నమోదైన అత్యాచార కేసుల్లో ఒక కేసులో కూడా శిక్ష పడలేదు సరి కదా ఇంకా కూడా విచారణ పూర్తి కాలేదు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలు చేసే విధంగానే రాష్ట్రంలో మూడు రాజధానులు అన్న విషయాన్నికూడా అపహాస్యం చేయడానికి ముఖ్యంమత్రి పూనుకుంటున్నారని పలువురు ప్రతిపక్ష నాయకులూ ఎద్దేవా చేస్తున్నారు.