మాజీ మంత్రి భూమా అఖిలప్రియ( Bhuma Akhila Priya ) వ్యవహారం ఇప్పుడు టిడిపి అధిష్టానానికి తలపోటుగా మారింది ఆమె దూకుడుతో ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నంద్యాల సీటుపై( Nandyala ) తగ్గేదే లే అంటున్న అక్క తమ్ముళ్ల వ్యవహార శైలిపై ఆగ్రహం గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.వచ్చే ఎన్నికలలో నంద్యాల నుంచి ఫరూక్ వర్గానికి గాని ఇంతకుముందు అక్కడ నుంచి ఒకసారి గెలిచినా అఖిల కజిన్ బ్రహ్మానంద రెడ్డికి( Brahmananda Reddy ) గాని టిక్కెట్ వచ్చే ఉద్దేశంలో టిడిపి అధిష్టానం ఉంది.

అయితే ఆ సీటు తన తండ్రి చివరిసారి పోటీ చేస్తున్న సీటు అని ఆయన బ్రతుకున్నంత కాలం అక్కడ నుంచే పోటీ చేశారని అది అది తమ కుటుంబానికి చెందినదని భూమా కుటుంబం తొడగొట్టి మరీ చెబుతుంది .నంధ్యాల మా రక్తంలోనే ఉంది అంటూ భూమా జగద్ విఖ్యాత రెడ్డి( Jagat Vikhyata Reddy ) గట్టిగా సౌండ్ చేస్తున్నారు .మా బలం, బలగం అంతా అక్కడే ఉందని ఇకపై నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో ప్రచారం చేస్తామంటూ అక్క తమ్ముడు చెబుతున్నారు.ప్రచారం జరుగుతున్నట్టుగా తమకు నంద్యాలలో తిరగవద్దు అని టిడిపి అధిష్టానం చెప్పలేదంటూ కూడా ప్రకటించడం గమనార్హం

టిడిపి ( TDP ) టికెట్ ఇవ్వకపోయినా అక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశంతోనే అఖిలప్రియ అలా మాట్లాడారని వార్తలు వస్తున్నాయి.దాంతో ఈ రెండు సీట్లలో వ్యవహారం చక్కబెట్టడం టిడిపికి తలకి మించిన భారంగా మారినట్లు తెలుస్తుంది.అయితే అక్కడ రాజకీయంగా ఉన్న పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత టికెట్ పై నిర్ణయం తీసుకోవచ్చని అప్పటివరకు అనవసరమైన చర్చలకు తావివ్వకూడదంటూ అఖిలప్రియకు టిడిపి తేల్చి చెప్పినట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ తన తల్లిదండ్రులు బతికి ఉన్నప్పటి నుంచి వస్తున్న నియోజకవర్గాన్ని ఇప్పుడు వదులుకుంటే గనుక మళ్లీ తమకు దక్కదు అని భావిస్తున్న అఖిలప్రియ వర్గం ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాలను వదులుకోకూడదని భావిస్తున్నట్లుగా సమాచారం.







