ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట క్రమ క్రమంగా మసకబారుతోంది.ఆ పార్టీలో గతంలో కనిపించిన విలువలు, క్రమశిక్షణ క్రమక్రంగా తగ్గుముఖం పడుతున్నాయి.
తెలుగుదేశం అంతే చొక్కా చింపుకునే నేతల్లో కూడా ఇప్పుడు పార్టీ పై నమ్మకం తగ్గిపోతోంది.దీనంతటికి కారణం ఎవరూ అంటే అందరి వేలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు కారణంగా పార్టీ కి ఈ దుస్థితి ఏర్పడినట్టు కనిపిస్తోంది.ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బాబు నైజం పార్టీ నాయకులకే రుచించడంలేదు.

టీడీపీ కి ఆజన్మ విరోధి అయినా కాంగ్రెస్ పార్టీ తో బాబు పోతూ పెట్టుకోవాలని చూడడం ఆయన అవకాశం రాజకీయవాదానికి నిదర్శనంగా కనిపిస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.ప్రత్యేకహోదా, బీజేపీ, కాంగ్రెస్, మైనారిటీలు ఈ ఉదంతాలన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు మాట మార్చాడు.అలాగే ఏకకాలంలో దేశమంతా ఎన్నికలు, ఈవీఎంలు ఇలా అన్నింటిలోనూ చంద్రబాబు నాయుడు తీరు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది.సందర్భానికి తగ్గట్టుగా, తన అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు మాటలు మార్చేస్తూ ఉన్నాడు.
ఈ తీరుతో ప్రజల్లో టీడీపీ పలుచనవుతోంది.
ప్రత్యేకహోదా కావాలి అని గత ఎన్నికల ముందు.
ప్రత్యేక హోదా వద్దని బీజేపీతో అంటకాగుతున్నంతసేపూ.మళ్లీ ప్రత్యేకహోదా కావాలని బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక బాబు డిమాండ్ ప్రారంభించాడు.
ఇక మైనారిటీల విషయంలో కూడా ఇదే పరిస్థితి.నాలుగున్నరేళ్లుగా మైనారిటీకి మంత్రి పదవిని ఇవ్వలేదు.
తన తనయుడికి మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశాడు.ఒక్క ముస్లిం కు కూడా అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు.
బీజేపీతో కలిసి ఉన్నంతసేపూ బాబుకు మైనారిటీలు గుర్తుకు రాలేదు.ఇప్పుడు మైనారిటీల మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ కురిపించేస్తున్నాడు.
ఈ పరిస్థితులన్నీ తెరెడీపీ కి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి.