ప్రముఖ సైకాలజిస్ట్ గా గుర్తింపు పొందిన నగేశ్‌కు జైలుశిక్ష పడింది.ఏపీలోని గుంటూరు జిల్లా ఈపూరుకు చెందిన నగేశ్.
హైదరాబాద్ కేంద్రంగా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తుంటారు.ఈ నేపథ్యంలో పలు కాలేజీల్లో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్న నగేశ్ పై హైదరాబాద్ కు చెందిన ఓ కళాశాల విద్యార్థిని అసభ్యంగా మాట్లాడారంటూ షీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో షీ టీమ్ పోలీసులు నగేశ్ ను అదుపులోకి తీసుకుని.నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసులో నిందితునికి 16 రోజులపాటు జైలు శిక్ష విధించింది.అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.