ఎలక్షన్ అంటే కలెక్షన్ సీజన్...!

నల్లగొండ జిల్లా:గతంలో ఎన్నికలంటే( Elections ) ఓ పద్ధతి పాడు ఉండేది.ఇక ఎన్నికల మీటింగులు అంటే ఆయా పార్టీలను నమ్ముకున్న నిఖార్సైన కార్యకర్తలే సభల్లో కనిపించేవారు.

 Election Means Collection Season, Elections, Social Media , Party Flags , Parl-TeluguStop.com

అందులోనూ ఏ పార్టీ మీటింగ్ అయితే ఆ పార్టీకి చెందిన వారే హాజరయ్యేవారు.వారికి ఆ పార్టీ నేతలు తులమో ఫలమో ఇచ్చి ఖుషీ చేసేవారు.

మీటింగ్ కు హాజరైన ప్రజలను బట్టి ఆయా పార్టీల బలాబలాలు అంచనా వేసేవారు.ప్రస్తుతం ట్రెండ్ మారింది.

ఎలక్షన్ వస్తే చాలు కలెక్షన్ సీజన్ షురూ అయినట్లే.ఏ పార్టీ మీటింగ్ అయినా సరే కార్యకర్తల కంటే ఖరీదుకు వచ్చిన కూలీలే ఎక్కువగా కనిపిస్తారు.

వీరంతా ఒక పార్టీకి చెందిన వారు కాదు.ఏ పార్టీ కార్యక్రమమైనా సరే సైగ చేస్తే చప్పట్లు కొట్టే బ్యాచ్, విమర్శిస్తే ఈలలు వేసే బ్యాచ్, జెండాలు మోసే బ్యాచ్, జిందాబాద్ కొట్టే బ్యాచ్ అందరూ పెయిడ్ ఆర్టిస్టులే.

వీరిని మెయింటేన్ చేసే వర్గం వేరే.వీరికి కూలీతో పాటు బీరు,బిర్యానీ అదనంగా ఉంటుంది.

ఎక్కడ మీటింగ్ పెట్టినా,ఏ పార్టీ పెట్టినా దళారులు రంగంలోకి దిగిపోతారు.ఎంతమందిని తీసుకురావాలి,ఎంత పైకం ఇవ్వాలి,ఏ వాహనం కావాలనే దాన్ని బట్టి రేటు మాట్లాడుకొని జన సమీకరణ చేస్తారు.

ఒక్కోసారి పార్టీ అభ్యర్థులు ప్రజలకు ఇచ్చే పైకంలో దళారులు,చోటా మోటా నాయకులు కొంత నొక్కేసి, కొంతే వారికి ముట్టజెపి పంపిస్తారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ తరహా సీజన్ బాగా నడుస్తుంది.

నాయకులు ఏ విధంగా అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి చేరిపోతున్నారో ఓటర్లు, ప్రజలు కూడా వారినే అనుసరిస్తూ ఏ పార్టీ అయితే మాకేంటి మాకు కావాల్సింది పైసలు (కూలీ) అని డిసైడ్ అయ్యారు.ఈ పార్టీ మీటింగ్ పెట్టినా ఆ పార్టీ జెండాలు పట్టుకోవడం,బ్యానర్లు కట్టడం, జిందాబాద్‌లు కొట్టడం, ప్రసంగాలకు విజిల్స్‌ వేయటం, అవసరమైన సందర్భంలో డాన్సులు చేయడం,చప్పట్లు కొట్టండి అనగానే మోత మోగించడం పనిగా మార్చుకున్నారు.

ఇందులో కూడా చేసే పని బట్టి వేతనం ఉంటుంది.ఇక పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) ప్రచారం జోరందుకుంది.బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌,బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు.అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేలా భారీ ర్యాలీలు,మైకుల మోత, కళాకారుల కోలాట నృత్యాల నడుమ ఓటర్ల వద్దకు చేరుతున్నారు.

ప్రధాన నాయకుల వెంట పెద్ద ఎత్తున జనం ఉండేలా చూస్తున్నారు.అభ్యర్థులు ఓట్ల కోసం చెమటోడుస్తుంటే,ఇదే అదునుగా వ్యాపారులు వివిధ రకాల సామాగ్రి అమ్మకాలతో పుల్ జోష్ లో ఉన్నారు.

మద్యం,బిర్యానీ సెంటర్లు, పూలదండలు,బొకేల వ్యాపారం ఒక్కసారిగా పెరిగింది.ఎలక్షన్ల సమయాన్ని తమకు అనుకూలంగా మల్చుకుంటూ,నాలుగు పైసలు పోగేసుకునే పనిలో పలువురు ఉరకలు వేస్తున్నారు.ప్రస్తుతం ఎండలు మండిపోతున్న తరుణంలో జన సమీకరణ చేయాలంటే ఒక్కొకరికి రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు ఇస్తున్నారు.దీంతో పాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో చికెన్‌ బిర్యానీ,వాటర్‌ బాటిల్‌, మద్యం ప్రియులకు క్వార్టరు బాటిల్‌ అందిస్తున్నారు.

అయితే ఎండల కారణంగా రోజంతా ప్రచారం చేయించడం లేదు.ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు,తిరిగి సాయంత్రం 4 నుంచి 9 గంటల వరకూ ప్రచారంలో ఉంచుతున్నారు.ఎన్నికల సమయంలో ఇదొక ఆదాయ మార్గంగా మారడంతో ఎవరు ముందుగా వచ్చి పిలిస్తే వారి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు కొంతమంది జట్లుగా సిద్ధమవుతున్నారు.ప్రచారం మరింత ఊపందుకుంటే తమకు వచ్చే మొత్తం కూడా పెరుగుతుందని వీరంతా భావిస్తున్నారు.

బీరు…బిర్యానీ ఆఫర్.! పార్టీల కోసం ప్రచారం చేస్తూ,పొద్దంతా కష్టపడి అలసిసొలసి ‘సుక్క’వేస్తూ రిలాక్స్‌ అవుతున్నారు.ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో మద్యం అమ్మకాలు కొంత మేర పెరిగాయి.పార్టీ శ్రేణులు చేజారిపోకుండా మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు.దీంతో పనిలో పనిగా వంటలు,కేటరింగ్‌ చేసే వారికి చేతినిండా పని దొరుకుతుండగా,రెడీమెడ్‌ బిర్యానీ సెంటర్లకు రోజువారి గిరాకీ పెరుగుతుంది.

సోషల్ మీడియా( Social media )పై ఫోకస్.!ఓటర్లను ఆకట్టుకునేలా అభ్యర్థులు అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

ప్రచారంలో కీలక భూమిక పోషిస్తున్న సామాజిక మాద్యమాల వైపు రాజకీయ పార్టీలు చూస్తున్నారు.వాట్సప్‌, ఫేస్‌బుక్‌,ట్విట్టర్‌లతో పాటు ఎస్‌ఎంఎస్‌లు,వాయిస్‌ కాల్స్‌తో అదరగొట్టేస్తున్నారు.

దీంతో డిజిటల్‌ మార్కెటింగ్‌ చేసే చాలా మందికి చేతి నిండా పని దొరుకుతుంది.ఒక్క ఫోన్‌ కాల్‌కు కొంత మొత్తంలో తీసుకుంటున్నారు.

ఏది ఏమైనా ఒకప్పుడు ఎలక్షన్స్ ప్రజా ప్రనిధులను ఎన్నుకోవడానికి జరిగేవి, ఇప్పుడు రాజకీయ బిజినెస్ మేన్ల తయారు చేయడానికి జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube