తెలంగాణ నేతలకు బీజేపీ అధిష్టానం పలు సూచనలు చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఢిల్లీలో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ముగిసింది.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పారు.ఇందులో భాగంగా 119 నియోజకవర్గాల్లో భారీ సభలు నిర్వహించాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ సిద్ధమని బండి సంజయ్ పేర్కొన్నారు.అదేవిధంగా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అనంతరం బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఆ రెండు పార్టీలు ప్లాన్ ప్రకారం దుష్ర్ఫచారం చేస్తున్నాయని ఆరోపించారు.
లిక్కర్ కేసుకు, బీజేపీకి సంబంధం లేదన్న ఆయన ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని వెల్లడించారు.