అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.పురుగుల మందు తాగి ఆంజనేయులు అనే విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఎస్కే వర్సిటీలోని హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడని సమాచారం.వెంటనే గమనించిన వర్సిటీ సిబ్బంది బాధితుడిని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే కొన్ని రోజులుగా లెక్చరర్ పోస్టులకు ఆంజనేయులు ప్రిపేర్ అవుతున్నారు.రెండు సార్లు పరీక్షల్లో విఫలం కావడంతో మనస్తాపానికి గురి కావడంతో పాటు అనారోగ్య కారణాలు కూడా ఉండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సమాచారం.