టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు ఇటీవలే ‘ఆగడు’ వంటి డిజాస్టర్‌ను చవి చూసిన విషయం తెల్సిందే.ఆ డిజాస్టర్ నుండి ఇంకా మహేష్‌బాబు తేరుకున్నదే లేదు.
మళ్లీ ఆ సినిమా దర్శకుడితో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.ఈయన చూపుతున్నది ఆసక్తి కాదని, ఈయన సాహసం చేయబోతున్నట్లుగా కొందరు సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్లకు మంచి సక్సెస్ దక్కింది లేదు.ప్రస్తుతం శ్రీనువైట్ల మెగా హీరో రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా ఎలా ఉండబోతుందో తెలియదు.ఆ సినిమా విడుదల కాకుండానే వీరిద్దరి కాంబినేషన్‌కు రంగం సిద్దం అయ్యింది.
‘దూకుడు’, ‘ఆగడు’ సినిమాలను నిర్మించిన 14 రీల్స్ సంస్థ మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేసేందుకు సిద్దం అయ్యింది.అయితే ఈసారి నిర్మాణంలో మహేష్‌బాబు మరియు శ్రీనువైట్లలు కూడా భాగస్వాములు అవ్వనున్నారు.
ఇప్పటికే మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’ మరియు ‘బ్రహ్మోత్సవం’ నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు.తాజాగా ఈ శ్రీనువైట్ల సినిమాకు కూడా నిర్మాణ భాగస్వామి అవ్వబోతున్నారు.
ఇక శ్రీనువైట్ల మొదటి సారి నిర్మాణంలోకి అడుగు పెట్టబోతున్నాడు.ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ చేస్తోన్న మహేష్‌బాబు వచ్చే నెలలో ఆ సినిమాను విడుదల చేయబోతున్నాడు.
అలాగే వచ్చే నెలలోనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.‘బ్రహ్మోత్సవం’ పూర్తి కాకుండానే ఆగస్టులో మహేష్ పుట్టిన రోజు సందర్బంగా 9వ తారీకున శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.
ఇలా వరుసగా మహేష్ సినిమాలు షురూ చేస్తోంటే సూపర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.