టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘బాహుబలి’ ఆడియో ఇటీవలే విడుదలైన విషయం తెల్సిందే.తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో ఈ ఆడియో వేడుక సందడి సందడిగా జరిగింది.
భారీ అభిమానుల సమక్షంలో, అభిమానుల చేతుల మీదుగా ఈ సినిమా ఆడియోను రాజమౌళి ఆవిష్కరింపజేశారు.ఆడియోకు కూడా మంచి స్పందన వస్తోంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో కూడా ఒక భారీ కార్యక్రమంను నిర్వహించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ శిల్పకళా వేదికలో టాలీవుడ్ ప్రముఖులతో పాటు, అభిమానుల సమక్షంలో మరో సారి ఒక వేడుక నిర్వహించాలని దర్శకుడు రాజమౌళి మరియు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
అయితే ఆ కార్యక్రమంకు ఏం పేరు పెట్టాలి అనే విషయంలో జక్కన్న ఆలోచనల్లో పడ్డట్లుగా తెలుస్తోంది.ఆడియో సక్సెస్ మీట్ అనేకన్నా మరేదైనా పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించాలని, అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఆ కార్యక్రమం ఉండాలని జక్కన్న భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ వారంలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.ఈ సినిమా వచ్చే నెల 10న రాబోతున్నట్లుగా జక్కన్న అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.