మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అంటూ మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చిరంజీవి తన పుట్టిన రోజు సందర్బంగా అంటే ఆగస్టులో ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
పూరి జగన్నాధ్ ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు, రామ్ చరణ్ తన తల్లి పేరుపై ఈ సినిమాను నిర్మించబోతున్నాడు అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.అయితే తాజాగా పూరి జగన్నాధ్‌ను ఈ సినిమా నుండి తప్పించి, వినాయక్‌ను తీసుకున్నారు అని, ఈ సినిమా చేతులు మారింది అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
అయితే అవన్ని ఒట్టి పుకార్లు మాత్రమే అని తేలిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకు పూరినే దర్శకుడు అని మరో సారి క్లారిటీ అయ్యింది.
తాజాగా పూరి జగన్నాధ్ ట్విట్టర్లో ఈ సినిమా గురించి స్పందిస్తూ… తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఫస్ట్‌హాఫ్ కథను చెప్పడం జరిగింది.సీన్‌టు సీన్ ఆయనకు వివరించాను.
అందుకు చాలా మంచి స్పందన ఇచ్చాడు.సూపర్బ్ అంటూ కితాబు ఇచ్చాడు.
ఇదే ఉత్సాహంతో రెండవ సగం స్క్రిప్ట్‌ను కూడా మరింతగా ఆకట్టుకునేలా తయారు చేస్తాను అంటూ మెగా ఫ్యాన్స్‌కు హామీ ఇస్తున్నాను అంటూ పూరి ట్వీట్ చేశాడు.పూరి ట్వీట్‌తో చిరు సినిమాకు దర్శకుడు మారలేదు, సినిమా చేతులు మారింది లేదు అంటూ క్లారిటీ వచ్చింది.