సూర్యాపేట జిల్లా:మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడంపై శుక్రవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా పార్టీలో నివురుగప్పిన నిప్పులా రగులుతున్న వర్గపోరు రచ్చకెక్కింది.హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయిన విషయం తెలిసిందే.
దీనితో నియోజకవర్గంలో గులాబీ నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటున్నారు.
నేడు ఇంద్ర చౌక్ లో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పట్టణ లీడింగ్ నేతలు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మలిదశ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు,మలిదశ ఉద్యమకారులు మరొకవైపు ధర్నాలో పాల్గొనడంతో సగటు గులాబీ కార్యకర్తలు కంగారు పడుతున్నారు.ప్రస్తుతం ఈ విషయం హుజూర్ నగర్ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.