ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లో  వైద్యుల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) లో ఖాళీగా ఉన్న పలు వైద్య పోస్ట్ లు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు.జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్, ఎమర్జెన్సీ వార్డ్ ల్లో నాలుగు పోస్టులు ఖాళీ ఏర్పడగా,  ఆయా పోస్టులకు సివిల్ అసిస్టెంట్ (ఎం బీ బీ ఎస్) అర్హతగా నిర్ణయించి, దరఖాస్తులు ఆహ్వానించారు.

 Interviews For Filling Up The Posts Of Doctors In The Government General Hospita-TeluguStop.com

మొత్తం తొమ్మిది మంది హాజరు కాగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన అభ్యర్థులకు తన చాంబర్లో ఇంటర్వ్యూలు నిర్వహించారు.ముగ్గురిని ఎంపిక చేసినట్లు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ లక్ష్మీనారాయణ వివరించారు.

ఈ ఇంటర్వ్యూలలో డీఎం హెచ్ ఓ వసంత రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube