కామారెడ్డిలో తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది.ఈ సందర్భంగా బీసీలకు కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది.
తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్ల కాల వ్యవధిలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.50 ఏళ్లు దాటిన పద్మశాలీలకు పెన్షన్ తో పాటు విశ్వకర్మల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామని తెలిపింది.బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్న కాంగ్రెస్ జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని పేర్కొంది.
అలాగే జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పింది.ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులంతో పాటు ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తామంది.బీసీ సబ్ ప్లాన్ ప్రవేశపెడతామని, బీసీ కార్పోరేషన్ ద్వారా రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొంది.అదేవిధంగా బీసీ -డీలో ఉన్న ముదిరాజ్ లను బీసీ -ఏలో చేరుస్తామని హామీ ఇచ్చింది.